Nara Lokesh : బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ కీలక కామెంట్స్.. భారత్-పాక్ మ్యాచ్‌పై కౌంటర్
Nara Lokesh : శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ కీలక కామెంట్స్ చేశారు.
- Harish Thanniru
- Published on- February 18, 2026 / 01:09 PM IST
Nara Lokesh
- బొత్సపై మంత్రి నారా లోకేశ్ కీలక కామెంట్స్
- పార్టీ సభ్యులపై ఆయన పట్టు కోల్పోయారు
- వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారోనని తమకు ఆసక్తిగా ఉంది
Nara Lokesh : శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ కీలక కామెంట్స్ చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీలో లోకేశ్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారో మాకు ఆసక్తిగా ఉందంటూ వైసీపీ సభ్యులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలపై గ్రిప్ కోల్పోయారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పరం విరుద్ధంగా రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చ డిమాండ్ చేస్తుంటే.. మరొకరు హిందాపూర్ డైయిరీపై చర్చ అడుగుతున్నారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారో మాకు ఆసక్తిగా ఉందని లోకేశ్ అన్నారు. సభలో మా స్ట్రాటజీ ఏంటో మీరు చూస్తారుగా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఇటీవల కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. మంత్రి కొలంబో వెళ్లి మ్యాచ్‌కు హాజరు కావడంపై పలువురు వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓ మీడియా ఛానెల్‌లో ప్రభుత్వ సొమ్ముతో నారా లోకేశ్ కొలొంబో వెళ్లారంటూ కథనం రావడంపై లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ప్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే.. నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చుచేస్తినా జగన్? అంటూ లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
