లక్షలాది మందిని చంపేందుకు కుట్ర చేశారు..!- వైఎస్ జగన్‌పై మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు

కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా లోకేశ్.

Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైఎస్ జగన్ కుట్ర చేశారని ట్వీట్ చేశారు. లక్షలాది మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యం అని చెప్పారు. జగన్ ప్లాన్ ఇస్తే ఎమ్మెల్సీ రఘురాం, నందిగం సురేశ్ అమలు చేశారని అన్నారు. గతంలో ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేశారని లోకేశ్ అన్నారు.

50మందిని చంపేసి ఐదు ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని మండిపడ్డారు నారా లోకేశ్. ఇప్పుడు ఇనుప బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టేలా చేశారని.. విజయవాడతో పాటు లంక గ్రామాలు లేకుండా చేయాలని అనుకున్నారని ట్వీట్ చేశారు. తమ కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా లోకేశ్.

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీని వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని, అవి వైసీపీ నేతలవేనని, దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక మాఫియా కోసం గతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేశారని, 50 మందిని చంపేశారని, ఐదుగురిని నామ రూపాలు లేకుండా చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఓ ప్లాన్ ప్రకారమే ప్రకాశం బ్యారేజీని కూల్చేసి విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా ప్లాన్ చేశారని, జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందంటూ నారా లోకేశ్ ఆరోపించారు.

ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలని కుట్ర చేశారని, ప్లాన్ ను అమలు చేసింది వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్ అని నారా లోకేశ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ట్వీట్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు నారా లోకేశ్. ఈ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ వైఎస్ జగన్, ఆయన బ్యాచ్ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు లోకేశ్. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రధారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్యే లేదంటున్నారు మంత్రి లోకేశ్.

బోట్లు ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎలా వచ్చాయి? అనేదానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లను నదిలోకి వదిలారన్నది పోలీసుల సమాచారం. ఈ ఘటనలో వైసీపీ కీలక నేతలకు సన్నిహితులైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అవసరమైతే సీబీ సీఐడీ విచారణకు ఆదేశించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

Also Read : ప్రధానిని అడిగి 10వేల కోట్లు తెండి, కాదంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేయండి- సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల డిమాండ్

ట్రెండింగ్ వార్తలు