Raptadu Incident: రాప్తాడు బాధితురాలికి మంత్రి పరామర్శ.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు!

రాప్తాడులో (Raptadu Incident)ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదియో తరగతి విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు.

Minister satya kumar visits school girl attacked in raptadu shifted to bengaluru

Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై ఓ ఉన్మాది రంపంతో అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో విద్యార్థిని ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలవ్వగా, అడ్డుకోబోయిన మరో విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం అనంతపురంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Cyclone Murasu: ఏపీకి మరో తుపాన్ ‘మురసు’ ముప్పు.. రేపటికి తీవ్రంగా మారే అవకాశం.. తీర ప్రాంత యంత్రాంగం అలర్ట్!

బాధిత బాలికను పరామర్శించిన మంత్రి సత్యకుమార్:

విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనంతపురం (Raptadu Incident)సర్వజన ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఆరా తీశారు.

ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలింపు:

వైద్యుల సలహా మేరకు బాలికకు మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం మంత్రి సత్యకుమార్ స్వయంగా పర్యవేక్షించి, ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.