పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 67 రోజుల తర్వాత ఈ రోజు (నవంబర్ 16, 2019)న 2: 45 నిమిషాలకు విడుదల అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చింతమనేని పై జిల్లాలోని వివిధ పోలిస్ స్టేషన్లలో భారీగా కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత సెప్టెంబర్ 11న ఆయనను పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అప్పటి నుంచి ఏలూరు జైలులోనే ఉన్నారు. ఇక ర్యాలీలు, ఊరేగింపులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
చింతమనేని పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.