MLA Grandhi Srinivas
Grandhi Srinivas Warning Lokesh : టీడీపీ నేత లోకేష్ కు భీమవరం (Bhimavaram) ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్ర ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని హెచ్చరించారు. చంద్రబాబుకు ఇన్ కమ్ టాక్స్ అధికారులు ఇచ్చిన ఐటీ నోటిస్ ల నుండి ప్రజలను దారి మళ్ళించేందుకే లోకేష్ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రకు ప్రజాదరణ లేకపోవడం వల్లనే అల్లర్లకు పాల్పడుతున్నారని తెలిపారు.
వైసీపీ ప్లెక్సీలు చించడం, రాళ్ళు రువ్వడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్ళు ఎర్పాటు చేసుకున్న ప్లెక్సీలను తాము టచ్ కూడా చేయలేదన్నారు. టీడీపీ రెచ్చగొట్టే చర్యలు ఎన్ని చేసిన తాము శాంతియుతంగానే ఉన్నామని చెప్పారు. అందుకే రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు. తాము తలుచుకుంటే పాదయాత్ర ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని హెచ్చరించారు.
తాను 100 ఎకరాలు ఆక్రమించానని, రూ.52 కోట్లు సంపాదించాని లోకేష్ విమర్శించాడని.. కబ్జా చేసిన 100 రకరాల భూమిని దమ్ముంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు. దొంగనోట్లు మార్పిడి చేసి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు రాసిచ్చిన అసత్యాలను ఆరోపించడం చూస్తుంటే నిజంగానే లోకేష్ పప్పే అని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. వ్యాన్లలో టీడీపీ నేతలు కర్రలు, రాళ్లు క్యారీ చేస్తున్నారని.. కావాలనే శాంతిభద్రతల సమస్య తీసుకొస్తున్నారని విమర్శించారు.
Also Read: పార్టీని కవ్వించేలా ప్రకటనలు.. అంతుచిక్కని కేశినేని నాని వ్యూహం, విజయవాడ టీడీపీలో అసలేం జరుగుతోంది?
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు. రీల్ హీరోపై రియల్ గా గెలిచిన నిజాయితీ పరుడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు.
లోకేష్ కు దమ్ముంటే భీమవరంలో పోటి చేసి గ్రంథి శ్రీనివాస్ పై గెలవాలని సవాల్ చేశారు. అనవసరంగా ఆసత్య ఆరోపణలు చేస్తూ శాంతిభద్రతల సమస్య సృష్టించ వద్దని హితవు పలికారు. రాజశేఖర్ రెడ్డి గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ పాదయాత్రలు చేసిన సమయంలో ఒక్క ఘర్షణ కూడా జరగలేదన్నారు. రాయలసీమ, ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.