చరిత్రకారుడు జగన్.. చరిత్రహీనుడు చంద్రబాబు : జీవితాంతం సీఎంగా ఉండాలి

ఏపీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి

  • Publish Date - January 9, 2020 / 07:21 AM IST

ఏపీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి

ఏపీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అదే సమయంలో మాజీ సీఎం చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చిన రోజా.. చంద్రబాబుని చరిత్రహీనుడిగా అభివర్ణించారు. అభివృద్ధి చేయలేని, చేతకాని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. పేదల చదువు కోసం అమ్మఒడి తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్ అయితే.. పేదల చదువుని కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు బలి చేసి చరిత్రహీనుడు చంద్రబాబు అని రోజా అన్నారు. చిత్తూరులో ”అమ్మఒడి” పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రోజా ఈ కామెంట్స్ చేశారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ.. చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు రోజా. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఎలాంటి పాలన అందించారో ఎంత అభివృద్ధి చేశారో గమనించాలని ప్రజలను కోరారు. పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు రోజా. పేద పిల్లల తల్లులు జగన్ ను ఆశీర్వదించాలని రోజా విన్నపం చేశారు.

ఎమ్మెల్యే రోజా కామెంట్స్:
* జీవితాంతం జగన్ సీఎంగా ఉండాలి
* రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించాలి
* ప్రజల సమస్యలు తీర్చాలి
* మాజీ సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి… చంద్రబాబు.. చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదు
* జగన్ చేసింది, చంద్రబాబు చేసింది చూసుకోవాలి
* పేదల చదువు కోసం అమ్మఒడి తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్
* పేదల చదువుని కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు బలి చేసి చరిత్రహీనుడు చంద్రబాబు

* పేదలు చదివే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విత్తుని తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్
* పేదలు చదివే 6వేల స్కూల్స్ మూసేసిన చరిత్రహీనుడు చంద్రబాబు
* మధ్యాహ్న భోజనంలో పేదలకు పౌష్టికాహారం ఇచ్చిన చరిత్రకారుడు జగన్.. ఆ పేద పిల్లలు తినే గుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు
* నాడు-నేడు పథకంలో 45వేల స్కూల్స్ ను ఆధునికీకరించి అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా చేస్తున్న చరత్రకారుడు జగన్
* తను చదివిన స్కూల్ ని కూడా అభివృద్ధి చేయలేని చేతకాని చరిత్రహీనుడు చంద్రబాబు