Mudragada Padmanabham, Chandrababu, Lokesh (Image Credit To Original Source)
Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.
“ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నాను. దీనికన్నా ప్రధానమంత్రిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం.
మాజీ మంత్రులు రజనీ, అంబటి, జోగి రమేశ్‌ను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయం? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉందా? తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడంతో మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోవడం వల్ల అ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాట్లు ఇంతా అంతా కాదు.
Also Read: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై కేసు నమోదు
ఎప్పుడూ అబద్ధం ఆడవద్దని, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పినా సరి చేయలేమని మా తండ్రి చెప్పేవారు. ఈ రోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు, మీ పార్టీ ఎంతో నష్టపోయింది. సీబీఐ రిపోర్టు వచ్చిన తర్వాతైనా కల్తీ గురించి మీరు చెప్పింది పొరపాటు అయ్యిందంటే చాలా బాగుండేది.. మీ గౌరవం పెరిగేది.
మీ పరిపాలనలో ఎంత సేపూ కాపు కులాన్నే టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈ రోజు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు, చేస్తున్నారు. ఎంత వరకు మీకు మంచిదనిపిస్తుంది. గతంలో ఈ కులానికి హామీ ఇచ్చారు, మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం అందరికి తెలిసిందే.
ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా, డిప్యూటీ సీఎం మీద ప్రేమతో మీకు మద్దతు వచ్చిందని నా అభిప్రాయం. ఈ కులం మీద ఎప్పుడూ మీరు రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి” అని పేర్కొన్నారు.