Nara Lokesh TDP : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ప్రకటన
Nara Lokesh TDP Working President: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని నియమించింది.
- Harishth Thanniru
- Updated on- April 15, 2026 / 05:20 PM IST
Nara Lokesh Appointed As Tdp Working President
- పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ
- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్
- పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు..
Nara Lokesh: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ నియామకమయ్యారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్లకు గౌరవం ఇస్తూ.. కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీలను ప్రకటించారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఉన్న నేతలకు అధిష్టానం పదవులను ఇచ్చింది.
Also Read: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్ అంటే.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
నామినేటెడ్ పదవుల్లో అవకాశాలురాని వారికి పార్టీ పదఃవుల ద్వారా న్యాయం చేశారు. పొలిట్ బ్యూరోలో అనుహ్యమార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి కమిటీలోనూ కొత్తవారికి అవకాశం కల్పించారు. 29మందితో పొలిట్ బ్యూరో, 31మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను ప్రకటించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులు మూడు, జాతీయ ఉపాధ్యక్షులు 18, జాతీయ అధికార ప్రతినిధులు 10మంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, రాష్ట్ర ఉపాధ్యక్షులు 16, రాష్ట్ర అధికార ప్రతినిధులు -14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు -10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు -59, రాష్ట్ర కార్యదర్శులు -77, నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీ్ల్లో ఒక్కొక్కరి చొప్పున నియమించారు.
మహిళలకు ప్రాధాన్యం..
రాష్ట్ర కమిటీలోని 185మందిలో 50మంది మహిళలకు చోటు కల్పించారు. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కింది. జనాభా దామాషా పద్దతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేశారు.
బడుగులకు పెద్దపీట..
రాష్ట్ర కమిటీలోని 185మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం దక్కింది. బీసీ సామాజిక వర్గంకు చెందిన వారు 77మంది నేతలకు అవకాశం దక్కగా.. ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన నేతలు 25మంది, ఎస్టీలు ఏడుగురు, మైనార్టీలు 13మందికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది.
పొలిట్ బ్యూరోలో వీరికి చోటు..
చంద్రబాబు నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, శ్రీదేవి గంట్కాడ, వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల వెంకటప్పారావు (నెహ్రూ), పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), గుత్తికొండ ధనుంజయ్, నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నర్సింహులు.
పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్లు..
నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణ దేవరాయలు.
