Pv Sindhu Academy: విశాఖలో ‘పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ’.. మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన
మంత్రి నారా లోకేశ్ ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్(Pv Sindhu Academy)’ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.
- V Santhosh Kumar
- Published on- August 5, 2026 / 12:35 PM IST
nara lokesh lays foundation stone for pv sindhu center for sports excellence in visakhapatnam
- విశాఖలో స్పోర్ట్స్ అకాడమీ శంకుస్థాపన
- నారా లోకేశ్ భూమిపూజ చేశారు
- పీవీ సింధు సంచలన ప్రాజెక్ట్
Pv Sindhu Academy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగానికి కొత్త ఊపిరి పోస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా వికాస కేంద్రానికి విశాఖపట్నంలో శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్(Pv Sindhu Academy)’ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అంతకుముందు నగరానికి చేరుకున్న మంత్రికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికగా, ఆయన స్థానిక నాయకులు, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
TGSRTC : హైదరాబాద్‌లో కొత్త మినీ బస్సులు.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
100 ఏళ్ల భవిష్యత్తు లక్ష్యంగా:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒలింపియన్ పీవీ సింధు మాట్లాడుతూ స్పష్టమైన లక్ష్యంతోనే ఈ భారీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. రాబోయే 100 సంవత్సరాల క్రీడా అవసరాలను తీర్చే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. తనకు పూర్తి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్‌లో 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్‌తో పాటు మొత్తం ఏడు ప్రధాన క్రీడా విభాగాలకు చెందిన నూతన అంశాలు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
ఇటలీ సాంకేతికతతో ‘మిర్తా పూల్’:
ఈ స్పోర్ట్స్ సెంటర్‌లో మరో ప్రధాన ఆకర్షణగా 25 మీటర్ల ఒలింపిక్ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తున్నారు. దీనిని ఇటలీకి చెందిన ప్రముఖ ‘మిర్తా పూల్స్’ సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు సింధు వెల్లడించారు. ఈ అకాడమీ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మరిన్ని అంతర్జాతీయ స్థాయి క్రీడా రత్నాలు వెలుగులోకి వస్తాయని, ఉత్తరాంధ్ర క్రీడాకారులకు ఇది ఒక గొప్ప వేదికగా మారుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
