Nara Lokesh : బాలా మామయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్
నారా లోకేష్ (Nara Lokesh) నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసి పరామర్శించారు.
- Thota Vamshi Kumar
- Published on- July 21, 2026 / 02:34 PM IST
Nara Lokesh phone call to Nandamuri Balakrishna regarding nbk111 shooting accident
Nara Lokesh : నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. #NBK111 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాలయ్య మోకాలికి స్వల్ప గాయమైంది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని చిత్ర బృందం తెలిపింది.
లోకేష్ పరామర్శ..
విషయం తెలిసిన వెంటనే విద్య, ఐటీ శాఖల మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ నందమూరి నటసింహానికి ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాలా మావయ్య త్వరగా కోలుకుని, యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Toxic : టాక్సిక్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ‘మనసాగదే..’
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో #NBK111 తెరకెక్కుతోంది. నయనతార కథానాయికగా నటిస్తోండగా.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీర సింహారెడ్డి తరువాత గోపిచంద్, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
