Nara Lokesh: జగన్‌కు నారా లోకేష్ సవాల్.. అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధం.. మెగా డీఎస్సీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)మెగా డీఎస్సీ-2025 నియామకాలపై కీలక ప్రసంగం చేశారు.

Nara lokesh speaks on mega dsc and challenge to jagan

  • రికార్డు స్థాయిలో డీఎస్సీ పూర్తి
  • పారదర్శకంగా నియామకాల ప్రక్రియ
  • జగన్‌కు లోకేష్ నేరుగా సవాల్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమయ్యాయి. సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ-2025 నియామకాలపై కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎంతో బాధ్యతాయుతంగా, పారదర్శకంగా కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని సభకు వివరించారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని, ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్, సింగపూర్ వంటి విదేశాలకు పంపి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందిస్తున్నామని కొనియాడారు. గత వైకాపా పాలనలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాదారులుగా నిలబెట్టి అవమానించారని ఈ సందర్భంగా విమర్శించారు.

Nagababu: నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం.. ఏపీ ప్రభుత్వం అధికారిక జీవో

కోర్టు తీర్పులు, రిజర్వేషన్ల అమలు:

ప్రజాస్వామ్యయుత పాలనలో నిరుద్యోగులకు, ప్రజలకు స్వేచ్ఛ ఉందని, భిన్నాభిప్రాయాల ఆధారంగా కోర్టుల్లో 336 కేసులు నమోదైనప్పటికీ చట్టబద్ధంగా ముందుకెళ్లామని స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేస్తూ ఈ నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం పాటించిన పారదర్శకత వల్లే వేలాది మంది ఎంపికైన ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు.

జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్:

వైకాపా బృందం డీఎస్సీపై 11 రకాల అనవసరపు నిందలు మోపుతోందని, కులం, మతం పేరుతో సమాజంలో చిచ్చు పెట్టే కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా అసెంబ్లీకి వస్తే డీఎస్సీ నియామకాలపై సమగ్రంగా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అసెంబ్లీ వేదికగానే కాకుండా ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధమంటూ విపక్ష నాయకుడికి నారా లోకేష్ (Nara Lokesh)నేరుగా సవాల్ విసిరారు.