నారా లోకేష్ ట్వీట్ : జగనే పెయిడ్ ఆర్టిస్టు

  • Publish Date - December 24, 2019 / 08:50 AM IST

రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. టీడీపీ – వైసీపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తుండడంతో పొలిటికల్ హీట్ క్రమక్రమంగా పెరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ysjagan గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ నేతలు గుర్తించడం మంచిదంటూ ఆయన ట్విట్టర్ వేదిగాక ట్వీట్ చేశారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం వరుస ట్వీట్స్‌తో విరుచుకపడ్డారు. 

* పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. 16 ఆగష్టు 2019న NRCపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు నారా లోకేష్. 
 

* ఇప్పుడు కడప సభలో NRC అమలు చెయ్యమని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.

*  రాజధాని మార్చడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఆధారాలు చూపించకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ysjagan పాత పాటే పాడుతున్నారు. నేను జగన్ గారికి సవాల్ విసురుతున్నా అన్నారు. 

* మీ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు జడ్జితో విచారణకు సిద్ధం. వైకాపా అధికారంలోకి వచ్చిన 7నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన 40 వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమా ? అంటూ లోకేష్ సవాల్ విసిరారు. సాగర తీరంలో జగన్ ల్యాండ్ మాఫియా సినిమా బయటపడుతుంది సవాల్ స్వీకరిస్తారా? అని వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. 

* భారీ వరదకి కూడా అమరావతి మునగలేదు. ysjagan గారి దొంగ దెబ్బకి అమరావతి మునిగిపోయింది. నిండు సభలో అమరావతికి జై కొట్టారు, కనీసం 30 వేల ఎకరాలు ఉంటే కానీ రాజధాని అభివృద్ధి సాధ్యం కాదు అన్నారు అని గుర్తు చేశారాయన. 

* రాజధాని అమరావతిలోనే ఉంటుందని మ్యానిఫెస్టోలో పెట్టారనే విషయాన్ని చెప్పారు. అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక మాటమార్చి, మడమ తిప్పి అమరావతిని ముంచేసారు జగన్. అంటూ నారా లోకేష్ ట్వీట్స్ చేశారు. ఈయన చేసిన ట్వీట్స్‌పై వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. 

Read More : కేపిటల్ పొలిటిక్స్ : రాజధాని రైతులకు అన్యాయం జరగదు – వైసీపీ ఎంపీ