పిన్నెల్లి తొడ గొట్టారు..ఎందుకు రెచ్చగొడుతున్నారు – నారా లోకేష్

  • Publish Date - January 8, 2020 / 07:51 AM IST

రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ దారిలో ఎందుకు వచ్చారు ? తొడ ఎందుకు కొట్టారు ? గొడవలు జరుగుతాయని రైతులు దండం పెట్టి చెబుతున్నా ఎందుకు వెళ్లారు ? ఎందుకు రెచ్చగొట్టారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. 2020, జనవరి 08వ తేదీన ఆయన మీడియాతో మాట్లాడారు.

 

ఎమ్మెల్యే వాడిన పదజాలం వింటుంటే బాధేస్తుందని, దాడి జరిగిన ఘటనలో 9 సెక్షన్లు నమోదు చేశారన్నారు. జేఏసీ పిలుపు మేరకు రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే..కావాలని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే..కావాలని రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఏదో భయబ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు చేయడం కరెక్టు కాదని సూచించారు. అధికారులు శాశ్వతంగా మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నారు..ప్రజా సమస్యలు పరిష్కరించే టైం ఎక్కడ అని ప్రశ్నించారు.

 

మూడు రాజధానులతో ఖర్చ పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫేక్ రిపోర్టులు తయారు చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారాయన. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ…22 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…2020, జనవరి 07వ తేదీన చినకాకాని వద్ద హైవే దిగ్భందం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో 15 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో భాగంగా…నారా లోకేష్ బుధవారం తుళ్లూరుకు వెళ్లారు. అక్కడ రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. 

Read More వైసీపీ ఎమ్మెల్యే కారు ధ్వంసం ఘటనలో యువకుడు అరెస్టు