Nara Rammurthy Naidu Passes Away
Nara Rammurthy Naidu Passes Away: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో స్వగ్రామం నారావారి పల్లెకు తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేశ్, కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. రామ్మూర్తి పార్థివ దేహాన్ని బంధువులు, స్థానికులు సందర్శనార్ధం ఉంచారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.
Also Read: Nara Rohit: ‘నాన్నా.. మీరొక ఫైటర్’.. తండ్రి మృతితో సినీనటుడు నారా రోహిత్ భావోద్వేగ పోస్టు
మధ్యాహ్నం 3గంటలకు రామ్మూర్తి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు జరిగినచోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు. ఈ మేరకు ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ రామ్మూర్తి నాయుడు పార్ధివ దేహానికి నివాళులర్పించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నారావారి పల్లెకు చేరుకొని రామ్మూర్తి నాయుడు పార్ధివ దేహానికి నివాళులర్పిస్తున్నారు.