Nellore TDP : చెప్పినట్లే చేశాడు, అరగుండు, అరమీసం గీయించుకున్న టీడీపీ లీడర్!
ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో..చెప్పినట్లుగానే అతను చేసి వార్తల్లో నిలిచాడు.
- madhu
- Published On : November 18, 2021 / 03:32 PM IST
Nellore
TDP Leader With Half Mustache : ఎన్నికల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు వినిపించడం చూస్తూనే ఉంటాం. కొంతమంది నేతలు చెప్పిన దానిమీద కట్టుబడి ఉండరు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతుంటాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో..ఇలాంటి విషయాలు చాలా జరుగుతుంటాయి. గెలిస్తే..తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అది..ఇది చేస్తానని సవాళ్లు చేస్తుంటారు.
ఎన్నికల అనంతరం వాటిని కొంతమంది లీడర్స్ పట్టించుకోరు. కానీ..ఓ నేత మాత్రం చెప్పినట్లు చేశాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే..అరగుండు, అరమీసం తీయించుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో..చెప్పినట్లుగానే అతను చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ఆ పార్టీ ఏదో అర్థం అయ్యింది కదా..అదే టీడీపీ పార్టీ. ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పరాజయం చెందిన సంగతి తెలిసిందే.
Read More : CM Kcr Warning : వడ్లను తీసుకోవాల్సిందే..లేకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తాం – సీఎం కేసీఆర్ హెచ్చరిక
నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీకి చెందిన కప్పిర శ్రీనివాస్…మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 49, 50 డివిజన్లకు ఆయన టీడీపీ పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా…రెండు డివిజన్లలో టీడీపీ ఓడిపోతే…అరగుండు, అరమీసం తీయించుకుంటానని శపథం చేశారు. ఎన్నికల అనంతరం 2021, నవంబర్ 17వ తేదీ బుధవారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 54 స్థానాల్లో ఫ్యాన్ గాలి వీచింది. తాను చేసిన సవాల్ కు కట్టుబడిన శ్రీనివాస్..అరగుండు, అరమీసం గీయించుకున్నారు. జగన్ పోవాలి..బాబు రావాలి అని పలకపై రాసుకుని..మెడలో వేసుకున్నాడు.
