ఏపీకి కొత్త పోలీస్ బాస్.. నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ డీజీపీని మార్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే.

Ap New DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ వచ్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమితులయ్యారు. ద్వారకా తిరుమల రావును ఏపీ డీజీపీగా నియమిస్తూ ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకా తిరుమల రావు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.

1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ద్వారకా తిరుమల రావు వివిధ హోదాల్లో పని చేశారు. విజయవాడ సీపీగా పని చేశారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ లలో సీనియర్ ఆయనే. పూర్తి స్థాయిలో ఆయన సమర్థుడు అని గుర్తించిన ప్రభుత్వం.. డీజీపీగా నియామకం చేసింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ డీజీపీని మార్చారు.

రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. హరీశ్ కుమార్ గుప్తాను తిరిగి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆర్డీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమల రావును రాష్ట్ర నూతన డీజీపీగా అపాయింట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

Also Read : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఆ ముగ్గురు అధికారులకు బిగ్ షాక్..!

ట్రెండింగ్ వార్తలు