YS Vivekananda Reddy Case : వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్..

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు.

YS Vivekananda Reddy Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు. మొదటిసారిగా ఒక జిల్లా స్థాయి అధికారిని విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ తో పాటు మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్, పలువురు సిబ్బందిని కూడా విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని వాహనాల వివరాలను ట్రాన్స్ పోర్టు అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు. ఇప్పటివరకు అప్పటి పులివెందుల సీఐ శంకర్ ని మాత్రమే విచారించారు. నాలుగు రోజులుగా వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరిని విచారిస్తూ ఆయనతో పాటు ట్రాన్స్ పోర్టు అధికారులను విచారిస్తున్న సీబీఐ అధికారులు.

వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరిలను సీబీఐ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. అలాగే పులివెందులకు చెందిన మరికొంతమంది అనుమానితులు ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నిన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్ గా పనిచేసిన హిదయతుల్లా, పులివెందులకు చెందిన కిరణ్‌కుమార్‌ యాదవ్‌లను పిలిపించి సీబీఐ అధికారులు ఏడు గంటల పాటు విచారించారు.

2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య వెలుగుచూసిన రోజు తొలుత మృతదేహాన్ని కంప్యూటర్‌ ఆపరేటర్ హిదయతుల్లా తన సెల్‌ఫోన్ లో ఫొటోలు తీసినట్లు అధికారుల దగ్గర ప్రాథమిక సమాచారం ఉందని, ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? బాత్రూమ్ నుంచి వివేకా మృతదేహం బెడ్‌ రూములోకి ఎవరు తరలించారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు