Rayalaseema Ngt
NGT on Rayalaseema: నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. కేఆర్ఎంబీకి ప్రత్యేక ఆదేశం ఇచ్చింది. పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్టు నిర్మాణ పనులపై రిపోర్టును గైడ్‌లైన్స్ ప్రకారం దాఖలు చేయాలని చెప్పింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆగష్టు 27కల్లా సంబంధిత నివేదిక దాఖలు చేయాలని చెప్పింది.
తెలంగాణ తరపు న్యాయవాదులు ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోత పనులను ఫొటోల రూపంలో ఎన్జీటికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణ చేస్తూ పనులు చేపడుతున్నట్లుగా కేఆర్ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఫొటోలను చేస్తే అర్థం అవుతుందని ఎన్టీటీ వెల్లడించింది. ఈ విషయంలో కేఆర్ఎంబీ పూర్తి స్థాయి రిపోర్టును పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు ఇస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు జూలై 7వ తేదీనే పనులు నిలిపివేసినట్లుగా చెప్పింది. ఈ స్టేట్మెంట్ అబద్ధం అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఏపీ చీఫ్ సెక్రటరీ అసత్యం పలుకుతున్నారన్నారు. తాము ఇచ్చిన నివేదికలో ఫొటోలతో సహా వివరించినట్లు పేర్కొన్నారు.
పిటిషనర్ తరపు వాదనల ప్రకారం.. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు రుజువైతే అధికారులను జైలుకు పంపే సందర్భాలు ఉన్నాయా అంటూ ఎన్జీటీ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే తదుపరి విచారణను ఆగష్టు 27కు వాయిదా వేశారు. ఆ లోపు రిపోర్టులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే సమర్పించాలని ఆదేశమిచ్చారు.