Amaravati ORR: అమరావతి ORR డిజైన్లలో కీలక మార్పులు.. రూ.7,959 కోట్లు ఆదా.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్(Amaravati ORR) నిర్మాణ ప్రణాళికల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు పలు కీలక మార్పులు చేశారు.

NHAI made several key changes to the construction plans for the Amaravati Outer Ring Road.

Amaravati ORR: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర రవాణా రంగానికి ఎంతో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్(Amaravati ORR) నిర్మాణ ప్రణాళికల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు పలు కీలక మార్పులు చేశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని తగ్గించే దిశగా కొత్త నిబంధనలను సవరించి, మొత్తంగా 17 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లను ఖరారు చేశారు. 189.93 కిలోమీటర్ల పొడవుతో, 6 వరుసలతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలోకి వాహనాలు కేవలం ఈ ప్రతిపాదిత ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మాత్రమే ప్రవేశించేందుకు లేదా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

UP Rajya Sabha Elections: యూపీ రాజ్యసభ పోరు.. 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్ర మంత్రులకు షాక్

వ్యయం భారీగా తగ్గింపు.. సవరించిన రూట్లు:

NHAI ఆదేశాల మేరకు గతంలో ప్రతిపాదించిన 19 ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్యను 17కు కుదించడంతో పాటు, ఓఆర్‌ఆర్‌లో కేవలం లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్లు ఉండేలా మార్పులు చేశారు. తెనాలి సమీపం నుంచి కాజ వరకు ఉన్న 17.5 కిలోమీటర్ల అనుసంధాన రహదారి ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. ఈ సవరణల ఫలితంగా ప్రాజెక్ట్ వ్యయం గతంలో ఉన్న రూ.38,450 కోట్ల నుంచి రూ.30,491 కోట్లకు, అంటే ఏకంగా రూ.7,959 కోట్లు భారీగా తగ్గడం విశేషం.

17 ప్రాంతాల్లో అత్యాధునిక ఇంటర్‌ఛేంజ్‌లు:

ఈ మార్గంలో ప్రయాణం సులభంగా సాగేందుకు జాతీయ రహదారులు క్రాస్ అయ్యే కంచికచర్ల, దుగ్గిరాలపాడు, మైలవరం, పొట్టిపాడు సహా 8 ప్రాంతాల్లో ‘డబుల్ ట్రంపెట్’ ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనున్నారు. అలాగే గన్నవరం, నందివెలుగు, అడవినెక్కలం వంటి 8 చోట్ల ‘రోటరీ’ ఇంటర్‌‌ఛేంజ్‌లను, మేడికొండూరు వద్ద ఒక ‘సింగిల్ ట్రంపెట్’ ఇంటర్‌ఛేంజ్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.