ఏపీలో కరోనా కల్లోలం : విజయనగరం, శ్రీకాకుళంలో లేని కేసులు..ఎందుకో తెలుసా

  • Publish Date - April 2, 2020 / 10:45 AM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ రాకాసి విజృంభిస్తోంది. కానీ రెండు జిల్లాలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో అందరి దృష్టి అటు వైపు మళ్లుతోంది. ఆ జిల్లాలే విజయనగరం, శ్రీకాకుళం. వీటి పొరుగున్న ఉన్న జిల్లాలు మాత్రం వైరస్ పాజిటివ్ కేసులతో ఉక్కిరబిక్కిరవుతున్నాయి. విజయనగరం, సిక్కోలు వాసులు మాత్రం ధీమాగా ఉన్నారు. 

చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాలపై పడగ విప్పుతోంది. భారతదేశంలో వేలాది సంఖ్యలో కేసులు నమోదు కావడం..50 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం డేంజర్ బేల్స్ మ్రోగిస్తున్నాయి. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ఏపీలో 132 పాజిటివ్ కేసులు నమోదవడం రాష్ట్రాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేస్తోంది. వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటోంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తబ్లిగి జమాత్ కారణంగా కేసులు అధికమయ్యాయి. 

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా చాలా మందే ఎన్నారైలు తిరిగి వచ్చారు. అయితే..వీరెవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. శ్రీకాకుళం జిల్లాకు 34 మంది విదేశాల నుంచి వచ్చారు. స్క్రీనింగ్ టెస్టుల అనంతరం వీరిని క్వారంటైన్ లో ఉంచారు. విజయనగరం జిల్లాకు వచ్చిన విదేశీయులను పూర్తిగా హోం క్వారంటైన్ చేశారు. పకడ్బంది చర్యలు తీసుకున్నారు.

తర్వాత..జరిగిన పరీక్షల్లో వీరికి పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలోనే జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర జిల్లాలకు సరిహద్దులను కంట్రోల్ చేసింది. దేశంలో ఈ జిల్లాలకు చెందిన వారు ఉండడం..తిరిగి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా..అప్పటికే ఆలస్యం అయిపోయింది. అధికారులు తీసుకున్న చర్యలతో ఎక్కడి వారెక్కడే ఉండిపోయారు.

మరోవిషయం ఏమిటంటే..ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి ఈ రెండు జిల్లాల నుంచి వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు. నిజాముద్దీన్ ఎఫెక్ట్ రెండు జిల్లాలపై లేదు. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఒక్కకేసు కూడా లేకపొవడం ఈ రెండు జిల్లాలకు కలిసొచ్చింది. 

Also Read | కరోనాకు కారణం అవేనని తెలిసిపోయిందా.. పిల్లులు, కుక్కలు తినడం ఆపేసిన చైనా