Chandrababu Health : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కాగా, చంద్రబాబుకి మెడికల్ టెస్టులు చేయాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కోర్టును కోరారు. చంద్రబాబు హెల్త్ కండీషన్ పై మెమో దాఖలు చేసినట్లుగా లాయర్ లూథ్రా కోర్టుకు తెలిపారు. వైద్యులు సిఫార్సు చేసిన అంశాలను కోర్టుకి వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతోందని, ఆయనకు రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.
కాగా, చంద్రబాబుకి ప్రభుత్వం మెడికల్ టెస్టులు చేయించిందని సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. అయితే, ప్రభుత్వ డాక్టర్లు చేసే వైద్య పరీక్షలు, వారు ఇచ్చే రిపోర్టులపై తమకు నమ్మకం లేదని లూథ్రా చెప్పారు. వ్యక్తిగత వైద్యులతోనే చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
Also Read : అందుకే చంద్రబాబు తనకు ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు: మంత్రి అంబటి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరిగాయి. చంద్రబాబు హెల్త్ కండీషన్ బాగోలేనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు లాయర్ హైకోర్టును కోరారు. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు హెల్త్ కి ఎటువంటి ఇబ్బంది లేదని, దానికి సంబంధించి రెగులర్ గా హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయని వారు కోర్టుకి వివరించారు.
చంద్రబాబు హెల్త్ కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే రిపోర్టుపై తమకు నమ్మకం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. వ్యక్తిగత వైద్యులతోనే చంద్రబాబు పరీక్షలు చేయించాలని, వారిచ్చే రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టును కోరారు. అయితే రాజమండ్రి జైల్లో చంద్రబాబుకి రెగులర్ గా వైద్య పరీక్షలు చేస్తున్నారని, చంద్రబాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కావాలంటే రిపోర్టులు చూడాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు.
Also Read : సీఎం జగన్ ప్రాణాలు కేంద్రం దగ్గర, ఆస్తులు తెలంగాణలో.. అందుకే ఈ భయం, మౌనం- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ప్రభుత్వం నుంచి వచ్చిన డాక్టర్లు ఇచ్చే మందులను చంద్రబాబు వాడటం లేదని, తన వ్యక్తిగత వైద్యులు ఇచ్చిన మందులనే వాడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చే వైద్యంపై చంద్రబాబుకి కూడా నమ్మకం లేని పరిస్థితి ఉంది.