JanaSena: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి

జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకుని, ఇటీవ‌లే పవన్ కల్యాణ్‌ను కలిశారు.

Padala Aruna, Pawan Kalyan

JanaSena – Aruna Padala: విశాఖ(Vizag)లో ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ మంత్రి పడాల అరుణ. ఆమె చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఉత్తరాంధ్ర ప్రాంత నేతలు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండుతుందని పవన్ అన్నారు.

రెండేళ్ల క్రితమే అరుణ టీడీపీ(TDP)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్ప‌టినుంచి ఆమె రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె త‌న మద్దతుదారులతో చర్చలు జరిపారు. జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకుని, ఇటీవ‌లే పవన్ కల్యాణ్‌ను కలిశారు.

విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం నుంచి అరుణ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పవన్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు అవసరమని ఆమె ఇటీవలే అన్నారు. కాగా, మూడో విడత వారాహి విజయ యాత్ర కోసం పవన్ విశాఖపట్నం చేరుకున్నారు. పవన్ తో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తారు.

TTD Chairman Karunakar Reddy: ధనవంతులకు ఊడిగం చేయడానికి ఈ పదవి చేపట్టలేదు.. వారికే నా మొదటి ప్రాధాన్యత