Panchakarla Ramesh Babu : పవన్ కళ్యాణ్ ను కలిసిన పంచకర్ల రమేష్ బాబు.. జులై 20న జనసేనలో చేరిక
పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని చెప్పారు.
- bheemraj
- Published On : July 16, 2023 / 04:25 PM IST
Panchakarla Ramesh Babu
Ramesh Babu Meet Pawan Kalyan : మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పంచకర్ల రమేష్ బాబు కలిశారు. జులై 20వ తేదీన పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరనున్నారు. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అదే విషయం పవన్ కళ్యాణ్ తో చెప్పానని రమేష్ బాబు పేర్కొన్నారు.
జులై 20వ తేదీన తన అనుచరులతో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతానని స్పష్టం చేశారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని చెప్పారు.
