Paritala sriram: కేతిరెడ్డి.. టీడీపీ నాయకులను గెలుక్కున్నవ్.. నిన్నువదలం.. ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తా..
అనంతపురం జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తాడిపత్రిలో రెండురోజుల క్రితం మంత్రి ఉష శ్రీ చరణ్, తాడిపత్రి మున్సిపల్...
- Harishth Thanniru
- Published On : April 20, 2022 / 02:37 PM IST
Paritala Sriram
Paritala sriram : అనంతపురం జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తాడిపత్రిలో రెండురోజుల క్రితం మంత్రి ఉష శ్రీ చరణ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధంసాగింది. ఆ వేడి చల్లారకముందే ధర్మవరం టీడీపీ నేత పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుని తప్పని ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టండి అంటూ సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ప్రజల సమస్యలపై పోస్టింగ్ లు పెడితే కేసులు పెడతామంటే ఎలా ఊరుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం భయపడమని, సోషల్ మీడియాలో నేనుకూడా పోస్టులు పెడతానని నా మీద ఎన్ని కేసులు పెడతారో, నన్ను కొడతారో చూద్దాం అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
Paritala Sriram : శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా… పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉండాలంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి.. టీడీపీ నాయకులను గెలుక్కున్నవ్.. నిన్ను వదిలిపెట్టం అంటూ పరిటాల శ్రీరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేతిరెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనులు అంతాఇంతా కాదు, వాటన్నింటిని బయటపెడతాం. నువ్వు బెదిరించి లాక్కున్న భూములున్నాయి, నీ తమ్ముడు చేసే రియల్ ఎస్టే ట్ ఉంది. నీ తమ్ముడు చేసే పనికిమాలిన దందాలను బయటపడతాం, ప్రతి ఒక్కటి బయటపెడతా, ఏవీ వదిలేది లేదు అంటూ హెచ్చరించారు.
Paritala Sriram : శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా… పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నాయకులను గెలుక్కున్నావని, ఎవ్వరు ఆగేదిలేదని, ప్రతిఒక్కరు నిన్ను ప్రశ్నిస్తారని, ఎంతమందిపై కేసులు పెడతావో, ఎంతమందిని జైల్లోకి వేస్తావో నేను చూస్తా అంటూ పరిటాల శ్రీరామ్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి రోజురోజుకు ఎక్కువవుతుందని, ఇది మంచి పద్దతి కాదని పరిటాల శ్రీరామ్ హితవుపలికారు. పరిటాల శ్రీరాం వ్యాఖ్యలు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. పరిటాల వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నేది ఆసక్తికరంగా మారింది.
