Parthasarathy
Parthasarathy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడింది. మంత్రి జోగి రమేశ్‌కు వైసీపీ అధిష్ఠానం ఈ సారి పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇస్తున్న విషయం విదితమే.
ఈ మేరకు ఇటీవల ఆయన పేరును ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ఇక పెడన నుంచి ఉప్పల హారిక పోటీ చేయనున్నారు. దీంతో పార్థసారథి టీడీపీలో చేరాలనుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈనెల 21న ఆ పార్టీలో చేరాలనుకున్నారు.
(ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?)
అదే రోజు చంద్రబాబు నాయుడు అయోధ్యకు వెళ్లనున్నారు. పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్న పార్థసారథికి నూజివీడు ఆప్షన్ ఇస్తోంది టీడీపీ అధిష్ఠానం. ఆయనకు పెనమలూరు నుంచి టికెట్ ఇచ్చేందుకు స్థానిక టీడీపీ నేతలు ఒప్పుకోవట్లేదు. చంద్రబాబుపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్థసారథి సీటుపై టీడీపీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతోంది.