chandrababu skill development case .CID Court
chandrababu skill development case ACB Court : చంద్రబాబు, బెయిల్, కస్టడీ పిటీషన్లపై మరోసారి పాస్ ఓవర్ అయ్యింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ రెండు పిటీషన్లపై విచారణ బుధవారం (సెప్టెంబర్ 27)న జరగాల్సి ఉంది. దీని కోసం న్యాయమూర్తి కోర్టుకు హాజరయ్యారు. అలాగే చంద్రబాబు తరపు లాయర్లు, సీఐడీ తరపు లాయర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు వినటానికి సిద్ధంగా ఉన్నామని న్యాయమూర్తి ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు రానుంది. దీంతో చంద్రబాబు తరపు లాయర్లు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ మధ్యాహ్నాం విచారించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై తీర్పు ఏం వస్తుందో వేచి చూసి ఆ తరువాత వాదనలు వినిపించాలని చంద్రబాబు తరపు లాయర్లు భావించారు. దీంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ విచారణ పూర్తి అయ్యాక తమ వాదనలు వినిపిస్తామని న్యాయమూర్తికి వెల్లడించారు.
దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ ఇరు పక్షాల న్యాయవాదులు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని చంద్రబాబు తరపు లాయర్లకు, సీఐడీ తరపు లాయర్లకు సూచించారు. దీంతో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ లంచ్ తరువాత జరిగే అవకాశాలున్నాయి.
కాగా.. చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఏసీబీ కోర్టు చంద్రబాబును సీఐడీ కష్టడికి రెండు రోజుల పాటు అప్పగించిన విషయం తెలిసిందే. సీఐడీ అధికారులు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పలు ప్రశ్నలు వేశారు. దానికి చంద్రబాబు సమాధానాలు చెప్పారు. దానికి సంబంధించిన రికార్డు అంతా ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు అప్పగించారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుతో మాట్లాడుతూ.. మీకేమన్నా అసౌకర్యం కలిగిందా… థర్డ్ డిగ్రి ఉపయోగించారా..? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : చంద్రబాబు విడుదల కోసం చర్చిలో నారా భువనేశ్వరి ప్రార్ధనలు