Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు. ఉత్తరాంధ్రా తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువ. దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారు.జనసేన అధికారంలోకి రాగానే ముందుగా తూర్పు కాపులు యొక్క గణాంకాలు వెలికి తీస్తాం.

pawan kalyan janasena

Janasena Pawan Kalyan : వారాహి యాత్రలో బిజీ బిజీగా గడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ నేతలతో సమావేశమయ్యారు. భీమవరం సమీపంలోని పెదమీరం నిర్మాల ఫంక్షన్ హల్ లో BC నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాలు నాదెండ్ల మనోహర్,ఉమ్మడి పగో జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, తూర్పు కాపు సంఘం నేతలు పాల్గొన్నారు. అలాగే తూర్పు కాపు సంగం అధ్యక్షలు చంద్రహోన్ తో పాటు మరో 450 మంది జనసేన పార్టీలో చేరారు. వారందరికి జనసేన కండువాలను మెడలో వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని పవన్ కల్యాణ్.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు.. ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రా తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువని దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారని అన్నారు. జనసేన అధికారంలోకి రావటం ఖాయం అని ధీమా వ్యక్తం చేసిన పవన్ జనసేన అధికారంలోకి రాగానే ముందుగా తూర్పు కాపులు యొక్క గణాంకాలు వెలికి తీస్తాం అని తెలిపారు. సమాజంలో అందరినీ సమానంగా చూస్తే ఈ కులాల గొడవ ఉండదని అప్పుడు ఈ కుల రాజకీయాలు ఉండవని అటువంటి సమాజం రావాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan : ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వను, ఏపీని నెంబర్ 1 చేస్తా- పవన్ కల్యాణ్

తూర్పు కాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారన్నారు.మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వారు కులాన్ని పట్టించుకోకుండా కులం పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదుగుతున్నారు అంటూ ఆరోపించారు.తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాలు విషయంలో తారతమ్యాలు ఎందుకు అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో కూడా కొంతమందిని బీసీ కులాలను వారి జాబితా నుండి తొలగించారని అన్నారు. అప్పుడు కూడా ఏ ప్రజా ప్రతినిధి ప్రశ్నించలేదని కానీ ప్రతీ మనిషిలోను ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు.రాష్ట్ర విభజన వలన బీసీ కులానికి చెందిన కాపులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.తూర్పు కాపుల అభ్యున్నత కోసం జనసేన పాటుపడుతుందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తూర్పుకాపులకు భరోసా ఇచ్చారు.

కాగా పవన్ కల్యాణ్ తన ప్రతీ సమావేశంలోను..ప్రతీ ప్రసంగలోను కాపు సామాజిక వర్గాలకు సంబంధించి ప్రస్తావిస్తుంటారు. బీసీలకు అధికారం రావాలని చెబుతుంటారు. కాపు సామాజిక వర్గంలో చీలికలు తెచ్చి రాజకీయ నేతలు కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారంటూ ఇటీవల వారాహి యాత్రలో ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే.

Lord Vishnu Statue In Sea : నడిసముద్రంలో శంఖు, చక్రాలతో ‘ఆది నారాయణుడు’ విగ్రహం .. శంభ్రమాశ్చార్యాల్లో మత్స్యకారులు..