Pawan Kalyan Ippatam : ఇంటికో లక్ష రూపాయలు.. ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
చెప్పినట్లుగానే ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు.
- Naveen
- Published On : November 25, 2022 / 08:13 PM IST
Pawan Kalyan Ippatam : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులకు జనసేనాని పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థికసాయం అందించనున్నారు.
ఈ ఆదివారం ఇప్పటం గ్రామస్తులకు ఆర్థిక సాయం అందించనున్నారు పవన్. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చెక్కులను అందిస్తారు పవన్ కల్యాణ్. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతీ ఇంటికి లక్ష రూపాయల చొప్పున బాధితులకు సాయం అందిస్తామని గతంలోనే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దీనికి సంబంధించి జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ”జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారు. అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారు. ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధలు విని చలించిపోయారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు” అని ఆ ప్రకటనలో ఉంది.
