Pawan Kalyan : జై భవానీ.. జై శివాజీ.. జై మహారాష్ట్ర అంటూ మహారాష్ట్ర విజయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్..

మహారాష్ట్ర ఎన్నికల విజయంపై పవన్ స్పందిస్తూ తన ట్విట్టర్ లో భారీ ట్వీట్ చేసారు.

Pawan Kalyan Tweet on Maharashtra Elections Results Congratulates NDA

Pawan Kalyan : నేడు మహారాష్ట్ర ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించింది. బీజేపీ దాని మిత్రపక్షాలు ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా NDA తరపున మహారాష్ట్రలోని పది నియోజక వర్గాల్లో ప్రచారం చేసారు. పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో పవన్ మద్దతు పలికిన NDA అభ్యర్థులే గెలిచారు. దీంతో పవన్ హవా నేషనల్ వైడ్ మరింత పెరిగింది.

Also Read : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఇక మహారాష్ట్ర ఎన్నికల విజయంపై పవన్ స్పందిస్తూ తన ట్విట్టర్ లో భారీ ట్వీట్ చేసారు. పవన్.. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర.. మహారాష్ట్రలో విజయం సాధ్జించిన NDA మహాయుతి కూటమికి అభినందనలు. ఈ విజయం ప్రధాని మోదీ మీద మహారాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుంది. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధిని, నిజాయతీని, బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని ఎంచుకున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పుట్టిన గడ్డ.. నిజం, శౌర్యం, న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని మరోసారి రుజువైంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ నాయకత్వం ప్రజల్లో విశ్వాసం నింపింది. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తుందని భావిస్తున్నాను. మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నాకు దక్కిన గౌరవం. మరాఠా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలను మర్చిపోలేను. ప్రజల కోసం, అభివృద్ధి కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేద్దాం జై మహారాష్ట్ర, జై భారత్ అంటూ ట్వీట్ చేసారు. దీంతో పవన్ ట్వీట్ మరాఠా నెటిజన్లు కూడా వైరల్ చేస్తున్నారు.