Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటన వేళ ట్రాఫిక్ మళ్లింపులు.. ఇలా వెళ్లండి..

ద్విచక్ర వాహనాలు మున్సిపల్ కార్యాలయ పక్కన లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలి.

Pawan Kalyan (Photo : Twitter)

Pawan Kalyan – Bhimavaram: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని పశ్చిమ గోదవారి జిల్లా (West Godavari district) భీమవరంలో శుక్రవారం జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భీమవరం పట్టణం, బీఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద పవన్ వారాహి యాత్ర, బహిరంగ సభ ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ను పలు పాయింట్ల నుంచి మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటన చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ స్థలాల గురించి వివరాలు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు

• గుడివాడ-కలిదిండి-కాళ్ల- నుంచి భీమవరం –పాలకొల్లు వైపు వచ్చే వాహనదారులు కోపల్లె హై స్కూల్ వద్ద మలుపు తీసుకొని ఉండి-ఎన్ఆర్పీ (NRP) అగ్రహారం రోడ్ – బైపాస్ రోడ్- బీవీ రాజు విగ్రహం-మెంటేవారి తోట బైపాస్- ఆర్టీసీ డిపో మీదుగా భీమవరం, పాలకొల్లు వైపునకు వెళ్లాలి

• పాలకొల్లు నుంచి భీమవరం-గుడివాడ వైపు వెళ్లే వాహనదారులు ఆర్టీసీ డిపో-నరసయ్య అగ్రహారం-కొడవల్లిరోడ్-మెంటేవారితోట బైపాస్- బీవీరాజు విగ్రహం -ఉండి రోడ్ లో జడ్డు బ్రహ్మాజీ కల్యాణ మండపం(వై-జంక్షన్) మీదుగా ఉండి- గుడివాడ వైపుగా వెళ్లాలి.

• తాడేపల్లి గూడెం నుండి భీమవరం-పాలకొల్లు వైపు వచ్చే వాహనాలు, గొల్లలకోడేరు-బీవీ రాజు విగ్రహం- మెంటే వారితోటబైపాస్- నర్సయ్య అగ్రహారం- ఆర్టీసీ డిపో మీదుగా పాలకొల్లు వెళ్లాలి

• తాడేపల్లి గూడెం నుండి ఉండి-గుడివాడ- వైపు వచ్చే వాహనాలు, గొల్లలకోడేరు-బీవీ రాజు విగ్రహం- వై-జంక్షన్ బైపాస్ రోడ్-ఉండి రోడ్- గుడివాడవైపు వెళ్లాలి.

• ఆర్టీసీ డిపో వద్ద నుంచి బైపాస్ మీదుగా బీవీ రాజు విగ్రహం వద్ద నుంచి తాడేపల్లిగూడెం వైపుగా, ఉండి రోడ్ వైపుగా వెళ్లాలి.

• నరసాపురం –తుండుర్రు-తాడేరు వైపు నుండి భీమవరం వచ్చే వాహనాలు వీరమ్మ పార్క్ వద్దనుంచి పెద్ద మసీదు మీదుగా ఆర్టీసీ బస్సు స్టాండ్-ఓవర్ బ్రిడ్జి వైపు వెళ్లాలి.

• గొల్లవానితిప్ప- కొమరాడ నుండి భీమవరం- ఉండి-గుడివాడ వైపు వచ్చే వాహనాలు హన్సి కల్యాణ మండపం మీదుగా జువ్వలపాలెం రోడ్- ఎస్కార్కేఆర్ (SRKR) కాలేజీ -పెదమీరం ఎన్టీఆర్ (NTR) విగ్రహం – కలెక్టర్ క్యాంపుకార్యాలయం రోడ్ మీదుగా ఉండి-గుడివాడకు వెళ్లాలి.

పార్కింగ్ ప్రదేశాలు

తాడేపల్లిగూడెం, కలిదిండి నుంచి వచ్చే 2/3/4 వాహనాలు – బీవీరాజు విగ్రహం దగ్గర ఉన్న విజయలక్ష్మి ధియేటర్ ప్రక్క రోడ్, డీమార్ట్ ఎదురుగా ఉండే పార్కింగ్ స్థలములో

తుందర్రు నుంచి భీమవరం వచ్చే, యనమదురు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు మున్సిపల్ కార్యాలయ పక్కన లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలి

పాలకొల్లు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు భీమవరం న్యూ బస్టాండ్ ఎదురు గా ఉన్న కేశవరావు హైస్కూల్ వద్ద (ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా)

Durga Temple: దుర్గగుడి పాలకమండలి  కీలక నిర్ణయాలు.. రూ.300 దర్శనానికి ఉచితంగా ఒక లడ్డూ.. ఇంకా..