Peddireddy Ramachandra Reddy: హైదరాబాద్‌లో దాక్కున్నారు.. ప్రజలను గాలికి వదిలేశారు: మంత్రి పెద్దిరెడ్డి

కుప్పం కోసం 5 సంవత్సరాల్లో 95 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని తెలిపారు.

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy – YCP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా ( Chittoor district ) కుప్పం(Kuppam)లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్డు బాట కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో దాక్కున్నారని, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఏ పథకమూ ప్రజలకు గుర్తొచ్చే పరిస్థితి లేదని అన్నారు.

ప్రజలను దోచుకున్న జన్మభూమి కమిటీలు మాత్రమే గుర్తుకు వస్తాయని పెద్దిరెడ్డి చెప్పారు. కుప్పం కోసం 5 సంవత్సరాల్లో 95 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని అన్నారు.

వచ్చే నెలలో హంద్రీనీవా పనులు పూర్తి చేస్తామని,జగన్ చేతులు మీదుగా ప్రారంభించి నీరు అందిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత జిల్లాను, సొంత నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. కుప్పం అభివృద్ధికి తాము రూ.60 కోట్లు కేటాయించామని చెప్పారు.

కరోనా సమయంలో చంద్రబాబు కనీసం కుప్పం నియోజక వర్గాన్ని పట్టించుకోలేదని పెద్దిరెడ్డి అన్నారు. ఎంపీగా రెడ్డప్పను, ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని కోరుతున్నానని చెప్పారు.

INDIA: అందుకే మా కూటమికి ఇండియా అని పేరు పెట్టాం: రాహుల్, మమత