Perni Nani: ఆర్జీవీ చెప్పాల్సింది చెప్పారు.., కమిటీతో మాట్లాడండి

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోమవారం ఆర్జీవీ కూడా ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు.

Rgv Perni Nani

Perni Nani: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోమవారం ఆర్జీవీ కూడా ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు. మీటింగ్ జరిగిన విధానంపై మంత్రి మీడియాతో ఇలా మాట్లాడారు.

‘రామ్ గోపాల్ వర్మ చెప్పాల్సింది చెప్పారు. అన్ని వివరంగానే విన్నాం. అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. ప్రభుత్వానికి 1956 సినిమాటోగ్రఫీ చట్టం అనుసరించి సినిమా టికెట్ ధరలు నిర్దారించే అధికారం ఉంటుంది’

‘ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటు అయింది. ఏదైనా చెప్పాలనుకుంటే కమిటీకి చెప్పొచ్చు. దాని సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం’

ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

‘కోవిడ్ వల్ల సినిమా హాళ్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే అనుమతి ఇస్తున్నాం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా’మని వివరించారు.