BSNL Broadband: బీఎస్ఎన్ఎల్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. నెలకు రూ.1499వరకూ చెల్లించాల్సిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియమ్ బెనిఫిట్ ను ఉచితంగా అందించ..

BSNL Broadband: బీఎస్ఎన్ఎల్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

Bsn Broadband

BSNL Broadband: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. నెలకు రూ.1499వరకూ చెల్లించాల్సిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియమ్ బెనిఫిట్ ను ఉచితంగా అందించనుంది. కేవలం రూ.999తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ తో ఫైబర్ టూ హోం ప్లాన్ అందిస్తున్నారు.

2వేల జీబీ వరకూ 150ఎంబీపీఎస్ స్పీడ్ తో ఆ తర్వాత 10ఎంబీపీఎస్ స్పీడ్ తో వచ్చే ఇంటర్నెట్.. సేవలు అందించగలదు. సూపర్ స్టార్ ప్రీమియ్ ప్లస్ ప్లాన్ తో పాటు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ 8ఓటీటీ అప్లికేషన్ల నుంచి ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా ఇవ్వనుంది.

Lions Gate LLP, Shemaroo Me, Shemaroo Gujarati, Hungama Music, Hungama play SVOD, SonyLIV Premium, Zee5 Premium, Voot Select, YuppTV Live లాంటి ఓటీటీల సేవలు ఉచితంగా పొందొచ్చు. రూ.949కు అందే సూపర్ స్టార్ ప్రీమియం-2 ప్యాక్ ను నిలిపేస్తూ.. రూ.999తో అన్ని టెలికాం సర్కిల్స్ లో మళ్లీ మొదలుపెట్టనుంది.

గత ప్లాన్ ను వాడుతున్న కస్టమర్లు గడువు కాలం పూర్తయ్యే వరకూ కొత్త బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.