PM Modi Amaravati Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. మే 2న ఏపీ రాజధాని అమరావతిలో ఆయన పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సచివాలయం వెనకవైపున ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ టూర్ పై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంఛార్జ్ మంత్రుల పర్యటనల్లో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని స్పష్టం చేశారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలన్నారు సీఎం చంద్రబాబు. సూర్యఘర్ పథకం అమలులో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Also Read : ఏపీలో 2260 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు..
ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోదీ వస్తారని కన్ ఫర్మేషన్ ఇచ్చింది పీఎంవో. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు చెప్పారు సీఎం చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీని పిలిచి ఆ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది.
అమరావతి పునర్ నిర్మాణ పనులకు హాజరుకావాలని గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, ప్రధాని సమయం, షెడ్యూల్ అన్నీ చూసుకున్నాక ప్రధాని కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు తన క్యాబినెట్ సహచరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. మే 2వ తేదీన సాయంత్రం ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉందన్నారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here