Ambati Rambabu Vs Puvvada : భద్రాచలం కావాలని అడిగితే ఇచ్చేస్తారా? తెలంగాణ మంత్రికి అంబటి ఘాటు రిప్లయ్

పోల‌వ‌రం ఎత్తు పెంపుపై వివాదం స‌రికాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని చెప్పారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. (Ambati Rambabu Vs Puvvada)

Ambati Rambabu Vs Puvvada : తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ వివాదం చెలరేగింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని పలు ప్రాంతాలకు వరద ముంపు ఉందని..పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు పెంపు వ‌ల్లే భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపున‌కు గురైందని.. వెంటనే ఏపీలో విలీనం చేసిన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన డిమాండ్ అగ్గి రాజేసింది. పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. స్ట్రాంగ్ గా రిప్లయ్ ఇస్తున్నారు.

పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 45.72 అడుగుల ఎత్తు వరకు ఫుల్ ట్యాంక్ లెవల్ కు అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గోదావరి వరదల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పల్లెలు కొన్ని మునగడం మనం చూస్తూనే ఉన్నాం అన్నారు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సెటిల్ అయ్యాయన్న మంత్రి అంబటి.. కొత్త వివాదాలకు అంకురార్పణ చేయవద్దన్నారు.(Ambati Rambabu Vs Puvvada)

Polavaram project : మాకు నష్టం జరిగింది..మరి హైదరాబాద్‌ని ఏపీలో కలిపేస్తారా? : మంత్రి బొత్స

సెటిల్ అయిపోయిన వివాదం మళ్లీ లేపడం ఎందుకని తెలంగాణ మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు మంత్రి అంబటి. ఈ వివాదాలు శ్రేయస్కరం కాదని ఆయన హితవు పలికారు. రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. వివాదాలకు తావు ఇవ్వవద్దని సూచించారు. వివాదాలు ఉంటే సెంటర్ వాటర్ కమిషన్ ఉందని చెప్పారు. ఘర్షణ అవసరమా? అని అడిగారు. తెలంగాణ, ఏపీలో సమస్యలు ఉంటాయన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలు ఎందుకు? అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్ట్ దశల వారిగా పూర్తవుతుందని చెప్పారు. ప్రపంచంలో పెద్ద స్పిల్ వే 50వేల క్యూసెక్కుల నీటిని ఒకేసారి విడుదల చేయగలిగిన ప్రాజెక్టు పోలవరం అని చెప్పారు. ”భద్రాచలం మునిగిన సందర్భం గతంలో లేదా? పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. వివాదాన్ని పెంచవద్దు” అని మంత్రి అంబటి రాంబాబు కోరారు.

Polavaram project : పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఏపీ,తెలంగాణ మంత్రుల మధ్య ఆరోపణలు

అలా అయితే ఏపీని తెలంగాణలో కలిపేస్తారా? అంటూ.. మంత్రి పువ్వాడ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా బదులిచ్చారు. ఇప్పుడు మంత్రి అంబటి కూడా అదే రీతిలో స్పందించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”బాధ్య‌తాయుతమైన ప‌ద‌వుల్లో ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. పోల‌వ‌రం ప్రాజెక్టుపై తెలంగాణ నేతల వ్యాఖ్య‌లు స‌రికాదు. పోల‌వ‌రం ప్రాజెక్టు సీడ‌బ్ల్యూసీ అనుమ‌తితోనే నిర్మాణం జ‌రుగుతోంది. పోల‌వ‌రం ఎత్తు పెంపుపై వివాదం స‌రికాదు. పోల‌వ‌రం ప్రాజెక్టును ద‌శ‌ల‌వారిగా పూర్తి చేస్తాం. ప్రాజెక్టు వ‌ల్ల ముంపు ఉంద‌న్న భావ‌న‌తోనే 7 మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేశారు. ఇప్పుడు ముంపు ఉందంటున్న నేత‌లు… తాము భ‌ద్రాచ‌లం కావాల‌ని అడిగితే ఇచ్చేస్తారా?” అని ప్ర‌శ్నించారు అంబటి.

ట్రెండింగ్ వార్తలు