Polavaram Project: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం పనులకు బ్రేక్.. కొట్టుకుపోయిన భారీ ఐరన్ పైపులు
మహారాష్ట్ర భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక పోలవరం(Polavaram Project) ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
- V Santhosh Kumar
- Published on- July 9, 2026 / 03:49 PM IST
Polavaram project works has been temporarily halted due to heavy rains in Maharashtra
- గోదావరి ఉధృతి పెరిగింది
- పోలవరం పనులకు అంతరాయం
- అధికారులు అప్రమత్తం అయ్యారు
Polavaram Project: మహారాష్ట్ర, క్యాచ్‌మెంట్ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఆకస్మిక వరద ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక పోలవరం(Polavaram Project) ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎగువ నుండి ముంచెత్తుతున్న వరద నీటి కారణంగా ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దాంతో, అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Revanth Reddy: పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటికే.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
వరద ఉధృతి తీవ్రతకు ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన భారీ ఐరన్ తూరలు, ఇనుప పైపులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా, స్పిల్ ఛానల్ కింద పనుల నిమిత్తం తాత్కాలికంగా నిర్మించిన మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా స్పిల్‌వేపై ఉన్న ప్రధాన రహదారి గుండానే సిబ్బంది, నిర్మాణ సామగ్రి రవాణా కొనసాగుతోంది.
ప్రస్తుతం పోలవరం(Polavaram Project) స్పిల్‌వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.80 మీటర్లకు చేరింది. ఎగువన వర్షాలు తగ్గకపోవడంతో రానున్న 24 గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు రక్షణకు, సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
