Revanth Reddy: పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటికే.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)షాబాద్ మండలం సీతారాంపురంలో కొత్త సోలార్ మాడ్యూల్ యూనిట్‌ను ప్రారంభించారు.
Cm Revanth Reddy inaugurated new solar module unit at Sitarampuram in Shabad Mandal.
- సోలార్ యూనిట్ ప్రారంభం
- ఆర్థిక లక్ష్యం సాధన
- పరిశ్రమల తరలింపు నిర్ణయం
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షాబాద్ మండలం సీతారాంపురంలో కొత్త సోలార్ మాడ్యూల్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఏటా లక్షకు పైగా వస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలను ఆకర్షించడం, యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల త్యాగాల వల్లే ఇక్కడ పరిశ్రమలు, ఓఆర్ఆర్ సాధ్యమయ్యాయని ఆయన కొనియాడారు.
Land Bass Book: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ
హైదరాబాద్ నివాసయోగ్యమైన నగరమైనప్పటికీ, పెరుగుతున్న కాలుష్య సమస్యను నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల నివసిస్తున్న 1.34 కోట్ల మంది శ్రేయస్సును కాపాడేందుకు, అక్కడి పరిశ్రమలను వెలుపలికి తరలించనున్నారు. అందుకోసం పెరి అర్బన్ రీజియన్‌లో ప్రత్యేక మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం (Revanth Reddy)స్పష్టం చేశారు.
