Eluru: సింథటిక్ కలర్స్‌తో టీ పొడి.. ఏలూరులో కలకలం.. అధికారుల దాడుల్లో బట్టబయలైన బండారం
- Naveen
- Updated on- February 28, 2026 / 12:04 AM IST
Fake Tea Powder Representative Image (Image Credit To Original Source)
Eluru: రాజమండ్రి కల్తీ పాల ఘటనతో ఏపీ వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రోజూ ఏదో ఒక చోట కల్తీ వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు నగరంలో టీ పొడి కల్తీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఏలూరు నగరంలో కల్తీ టీ పొడి వ్యవహారం కలకలం రేపింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడుల్లో బండారం బయటపడింది. ఇతర రాష్ట్రాల నుంచి టీ పొడి దిగుమతి చేసి వాటిలో సింథటిక్ కలర్స్ కలుపుతున్నారు నిందితులు. వాటిపై పలు రకాల స్టిక్కర్లు అంటించి సొంత బ్రాండ్ గా విక్రయాలు జరుపుతున్నారు. ఏలూరు పట్టణంలోని సూర్య ఎంటర్ ప్రైజస్ లో దాడులు జరిపిన అధికారులు కల్తీ టీ పొడిని పట్టుకున్నారు. అలా పలు దుకాణాల్లో సేకరించిన శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు అధికారులు.
Also Read: పెళ్లైన కొన్ని గంటలకే వరుడిని చంపిన వధువు సోదరులు.. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య
