Police Cases Registered Against Tdp Leaders Of Kuppam
police cases against TDP leaders : చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు స్టేషన్ లో హల్ చల్ చేయడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్స్ పై దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు నేతలు ఉండగా మిగిలిన నేతలు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. CRPC 154, 157, IPC 143, 341 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.
చంద్రబాబు పీఏ మనోహర్ తో పాటు మరో పది మందిపై కేసులు నమోదు చేశారు. రేపు పరిషత్ ఎన్నికల వేళ అరెస్టులు సంచలనంగా మారాయి.