ఆ మంటలు ఎలా అంటుకున్నాయి? వైసీపీ ఆఫీసుకి నోటీసులు పంపిన పోలీసులు

ఆ మంటలపై ఇటీవల దుమారం చెలరేగింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో వైసీపీ ఆఫీసుకి ఎదురుగా ఉన్న గార్డెన్‌లో ఇటీవల గడ్డి తగలబడి మంటలు వ్యాపించిన ఘటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ కార్యాలయానికి నోటీసులు పంపిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశించారు.

జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చడంలో భాగంగా సీసీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పారు.

Atishi Resigns: ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో సీఎం అతిశీ రాజీనామా

మంటలు ఎలా అంటుకున్నాయి?
వైసీపీ ఆఫీసుకి ఎదురుగా ఉన్న గార్డెన్‌లో మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం ఓ మిస్టరీగా మారింది. ఎవరైనా కావాలనే ఈ పని చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలని వైసీపీ ఆఫీసును పోలీసులు కోరితే దీనిపై ఇంకా స్పందన రాలేదని తెలుస్తోంది. జగన్‌ నివాసానికి పక్కనే వైసీపీ ఆఫీసు ఉంటుంది. దానికి ఎదురుగానే గార్డెన్‌ ఉంటుంది. ఫిబ్రవరి 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగాయి.

ఆ సమయంలో వైసీపీ నేతలు దీనిపై విమర్శలు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జగన్మోహన్‌ రెడ్డి ఇల్లు, ఆఫీసు వద్ద భద్రత కల్పించాలని అన్నారు. అక్కడ మంటలు చెలరేగడానికి కారకులెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకుడు నాగనారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.