ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రాజకీయ నేత ఘరానా మోసం.. కోట్ల రూపాయలు వసూలు

విజయనగరం జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రాజకీయ నేత నిరుద్యోగులకు టోకరా వేశాడు. కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

Political Leader Cheating

political leader cheating in the name of government jobs: విజయనగరం జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రాజకీయ నేత నిరుద్యోగులకు టోకరా వేశాడు. బాడంగిలో ఈ ఘటన జరిగింది. బాడంగి జెడ్పీటీసీ అభ్యర్థి పెద్దింటి రామారావు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమను మోసం చేశాడని బాధితులు బాడంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి రూ.25లక్షలు వసూలు చేశాడు. డబ్బు తీసుకున్నాడు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు.

తాము మోసపోయాని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఏడేళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని వాపోయారు. పెద్దింటి రామారావు.. దాదాపు 50మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దింటి రామారావుకి డబ్బు ఇచ్చి మోసపోయిన ఓ కుటుంబ పెద్ద మనోవేదనతో మరణించాడు. పోలీసుల స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.