Pawankalyan on his Yatra: నా రాష్ట్ర వ్యాప్త పర్యటనను అందుకే వాయిదా వేస్తున్నాను: పవన్ కల్యాణ్

జనసేనకు ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరింత సన్నద్ధంగా ఉండి యాత్ర చేపట్టాలని అన్నారు. మొదట తాము జనసేన-జనవాణి, కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రతి సెగ్మెంటు పైనా సమీక్షలు చేపడతామని అన్నారు. అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో చిన్నపాటి పోస్టింగులు పెట్టినా కేసులు పెట్టేస్తున్నారని విమర్శించారు. దీన్ని ఎదుర్కొనేలా లీగల్ సెల్ సూచనలు.. సలహాలివ్వాలని చెప్పారు.

NTR Health University row

Pawankalyan on his Yatra: ఆంధ్రప్రదేశ్ లో తాను చేపట్టాలనుకున్న పర్యటనను వాయిదా వేస్తున్నాననని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అమరావతిలో తమ పార్టీ లీగల్ సెల్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అక్టోబరులో యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించామని, అయితే ఈ మధ్య కాలంలో పార్టీ సన్నద్ధత, ప్రభుత్వ భవిష్యత్తుపై కొన్ని సూచనలు వచ్చాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కానుందని సర్వేలు వచ్చాయని అన్నారు. ప్రతి దానికీ ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుందని అన్నారు. మనిషికీ, అధికారానికి కూడా ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుందని చెప్పారు.

జనసేనకు ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరింత సన్నద్ధంగా ఉండి యాత్ర చేపట్టాలని అన్నారు. మొదట తాము జనసేన-జనవాణి, కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రతి సెగ్మెంటు పైనా సమీక్షలు చేపడతామని అన్నారు. అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో చిన్నపాటి పోస్టింగులు పెట్టినా కేసులు పెట్టేస్తున్నారని విమర్శించారు. దీన్ని ఎదుర్కొనేలా లీగల్ సెల్ సూచనలు.. సలహాలివ్వాలని చెప్పారు.

‘‘రూ.450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు మళ్లించారు. రూ.400 కోట్ల ఎన్టీఆర్ వర్సిటీ నిధులు మళ్లించారు. ఎల్ఐసీ ఇన్సూరన్స్ నిధులు దారి మళ్లించారు. నిధుల కోసమే ఎన్నికలు పెట్టి స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించేశారు. జగన్, షర్మిల మాత్రం ఆస్తుల శ్రద్ధగా పంచుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల్లో శ్రద్ధ లేదా..? తెలంగాణ సీఎంతో కప్పు కాఫీ తాగుతూ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చేశారు. ఇలాంటివన్నీ అడగడానికి చట్టసభల్లో బలం ఉంటే గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉండేది. చట్టసభల్లో ఉంటే స్పీకర్ మమల్ని పంపడం కాదు.. మనమే స్పీకర్ ని పంపే వాళ్ళం. కోడి కత్తి ఘటనలో ఏపీ పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు. కోడి కత్తి ఘటనలో అబ్బాయి ఏమయ్యాడో ఎవరికి తెలియదు.. ఆ కేసు ఏమయ్యిందో శిక్ష ఏమి పడిందో.. సమస్యలపై రోడ్ల పైకి వచ్చేప్పుడు మిలిటెన్ మైండ్ సెట్ తో రావాలి. న్యాయ వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. జస్టిస్ లపై కూడా కేసులు వేస్తున్నారు. మేము ఎన్నికల్లో మార్పు కోసం అడుగులు వేస్తున్నాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

5,664 fresh COVID-19 cases: దేశంలో కొత్తగా 5,664 కరోనా కేసులు.. నిన్న 14,84,216 వ్యాక్సిన్ డోసుల వినియోగం