CM Jagan PRC : పీఆర్సీకి ఎండ్ కార్డ్? నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ

ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమాలోచనలు జరిపారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై..

CM Jagan PRC : పీఆర్సీ సమస్యకు ఎండ్ కార్డు వేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగా సంఘాల నేతలతో సీఎం జగన్ గురువారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఫిట్ మెంట్ ఖరారు చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు.

Bharat Biotech : భారత్ బయోటెక్ కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు!

ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమాలోచనలు జరిపారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై ఆర్థిక శాఖ అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు