Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ల వేగం కొంతకాలం వాడకం తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మనకు కొత్త ఫోన్ కొనాలని అనిపిస్తుంది కదా?

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

Mobile Phone

Smartphone Tips: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ల వేగం కొంతకాలం వాడకం తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మనకు కొత్త ఫోన్ కొనాలని అనిపిస్తుంది కదా? అయితే, కొన్ని ట్రిక్స్ ద్వారా మీరు మీ పాత ఫోన్‌ని వేగంగా పనిచేయించవచ్చు. కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండా.. పాత ఫోన్ కొత్త ఫోన్ మాదిరిగానే వేగంతో పనిచేసేలా చేసుకోవచ్చు. వాస్తవానికి, దీని కోసం మీరు మీ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్‌లను మార్చుకుంటే సరిపోతుంది.

ఇప్పుడు అటువంటి 5 పద్ధతుల గురించి తెలుసుకుందాం:

1. ముందుగా మన ఫోన్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా కంపెనీలు తమ ఫోన్‌లకు 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉంటాయి. దీని కోసం, మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి సిస్టమ్ అప్‌డేట్ చేస్తే సరిపోతుంది.

2. యాప్‌లను డిలీట్ చేయండి
ఫోన్‌లో ఉన్న అన్ని యాప్‌లను ఒకసారి రివ్యూ చేసుకోండి.. వాటన్నింటినీ ఉపయోగిస్తున్నారా? లేదా? చెక్ చేసుకోండి. కచ్చితంగా అవసరం లేనివి ఉంటాయి. వాటిని ఫోన్‌లో నుంచి అన్ ఇన్‌స్టాల్ చేసేయండి. ముఖ్యంగా ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అవుతూ ఉండే కొన్ని యాప్‌లని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

3. ఈ విధంగా డేటాను క్లీన్ చేయండి
అనవసరమైన యాప్స్‌తో పాటు మీరు ఫోన్‌లోని డేటాను కూడా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఫుల్ స్టోరేజ్ కారణంగా చాలా ఫోన్‌లు స్లో అవుతాయి. అందువల్ల, మీరు ఉపయోగించని పెద్ద ఫైల్‌లు, వీడియోలు లేదా ఫోటోలను ఫోన్ నుంచి తొలగించండి. ఇది కాకుండా, మీరు ప్లే స్టోర్ నుండి ఏదైనా క్లీనర్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా ఈ పని చేయవచ్చు.

4. చాలా ఫోన్లలో డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది మీ ఫోన్‌లో కూడా ఉంటే మాత్రం దాన్ని ఉపయోగించండి. స్మార్ట్‌ఫోన్‌కు కొత్త లుక్ రావడంతో పాటు, దాని శక్తిని కూడా ఆదా చేస్తుంది.

5. పైన పేర్కొన్న అన్ని పద్ధతులు అనుసరించినా కూడా ఫోన్ ‘స్లో’గా ఉంటే మాత్రం.. ఫ్యాక్టరీ రీసెట్ చేయడమే మిగిలి ఉంటుంది. అంటే, మీరు ఫోన్ మొత్తం డేటాను తొలగించవలసి ఉంటుంది, దానికారణంగా కొత్త ఫోన్ కోన్నప్పుడు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు మీరు డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది.