BJP MP GVL : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది : ఎంపీ జీవీఎల్

బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.

BJP MP GVL

BJP MP GVL visakha steel plant : విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం ఏపీని అతలాకుతలం చేసిన పారేసింది. కార్మికులు, కార్మిక సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు ధర్నాలు..నిరసనలతో విశాఖ నగరం హోరెత్తిపోయింది. అయినా కేంద్రం ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని..ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది. బంగారు బాతుగుడ్డులాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోవటానికి ఎన్నో స్వదేశీ విదేశీ కంపెనీలు కూడా బిడ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. విశాఖకు రూ.300 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటూ ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్రా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 22 నుంచి విశాఖ-బెనారస్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఇప్పటికే ఏపీలో జనసేన-టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయని..మరోవైపు తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకున్నాయని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొచ్చారు.