Producer Bunny Vaas appointed as the chairman of the Janasena party campaign department
Bunny Vas – Pawan Kalyan : జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా నిర్మాత బన్నీవాస్ నియమితులయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నియామక ఉత్తర్వులను స్వయంగా పవన్ కల్యాణ్ నిర్మాత బన్నీ వాస్‌కు అందజేశారు.
జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా శ్రీ బన్నీ వాస్
* నియామక ఉత్తర్వులు అందజేసిన శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/j7J4q3qMiz
— JanaSena Party (@JanaSenaParty) December 14, 2023
TDP Janasena Strategy : టీడీపీ-జనసేన దూకుడు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా త్రిశూల వ్యూహం
ప్రచార విభాగం పార్టీకి కీలకమైందన్నారు. సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని బన్నీవాస్‌కు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలన్నారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలన్నారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ కు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.