అందుకే ఆమెను నేను దగ్గరకు తీసుకున్నాను.. ఈ ప్రేమ వ్యవహారాలేంటని కొందరిలో ఈ ప్రశ్నలు తలెత్తాయి..: దువ్వాడ శ్రీనివాస్‌

"శ్రీనివాస్‌ ఇలాంటి వాడా? అన్న ప్రశ్నలు కొందరిలో తలెత్తాయి. ఈ ప్రేమ వ్యవహారాలేంటీ? అనుకున్నారు. ఇది ప్రేమ కాదు.. లవ్వు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన విపత్కర పరిస్థితుల నుంచి తీసుకున్న నిర్ణయం" అని అన్నారు.

అందుకే ఆమెను నేను దగ్గరకు తీసుకున్నాను.. ఈ ప్రేమ వ్యవహారాలేంటని కొందరిలో ఈ ప్రశ్నలు తలెత్తాయి..: దువ్వాడ శ్రీనివాస్‌

Duvvada Srinivas

Updated On : September 13, 2025 / 7:23 PM IST

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన జీవితంలో జరుగుతున్న ఫ్యామిలీ ఫైట్‌ గురించి ఆయన వివరాలు తెలిపారు.

“జీవితంలో రాజకీయాలు చేయాలని విద్యార్థి దశ నుంచే ఆలోచించాను. ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్‌లో ఉండాలని రాజకీయాలను ఎంచుకున్నాను. స్టూడెంట్ పాలిటిక్స్‌లో కూడా అలాగే ఉండేవాడిని.

కాంగ్రెస్‌లో దూకుడుగా పనిచేసేవాడిని. రాజశేఖర్‌ రెడ్డితో మంచి స్నేహం ఉండేది. ఎర్రన్నాయుడితో యుద్ధం చేయాలని చెప్పారు. స్ట్రాంగ్‌గా పనిచేశాను. ఎవరినైనా వ్యతిరేకించి మాట్లాడడానికి నాకున్న ఒకే ఒక్క ధైర్యం నిజాయితీ.

ఇంత బాగా పనిచేస్తున్న నాకు కుటుంబ సమస్యలు వచ్చాయి. ప్రజలే దేవుళ్లని నేను నమ్మాను. 95 శాతం నా మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు 70-80 శాతం పాజిటివ్‌లోకి వచ్చేసింది. ఒక స్థాయికి వెళ్లిన నేను ఫ్యామిలీ ఇష్యూష్ కిందకు పడేశాయి.

శ్రీనివాస్‌ ఇలాంటి వాడా? అన్న ప్రశ్నలు కొందరిలో తలెత్తాయి. ఈ ప్రేమ వ్యవహారాలేంటీ? అనుకున్నారు. ఇది ప్రేమ కాదు.. లవ్వు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన విపత్కర పరిస్థితుల నుంచి తీసుకున్న నిర్ణయం.

Also Read: విదేశీ మూవీలు, టీవీ కార్యక్రమాలు చూస్తే ఉత్తర కొరియా ప్రజలను కిమ్‌ ఏం చేస్తున్నారో తెలుసా? ఏకంగా..

ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. దాచుకుంటే దాచుకోవచ్చు. దాని నుంచి ఇప్పుడే నేను బయటపడ్డాను. వాణి నాపైన వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి. ఆవిడకు ఎలాంటి అన్యాయమూ జరగకూడదని ఓ మంచి బంగ్లా రాసి పెట్టాను. దర్జాగా బతకడానికి ఓ పరిశ్రమను కూడా రాసిచ్చాను. ఆమెకు ఏ లోటు లేదు. పిల్లలను కూడా నేనే చూసుకుంటాను.

ఇప్పుడు నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నాను. వాణి మీడియా ముందుకు వెళ్లకపోయుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ఒంటరి అయినప్పుడు నా కోసం మాధురి నిలబడ్డారు. అందుకే ఆమెను నేను దగ్గరకు తీసుకున్నాను. ఆమె మంచి అమ్మాయి” అని అన్నారు.

ఫుల్‌ ఇంటర్వ్యూ