బీసీ సామాజిక నినాదంతో దువ్వాడ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఫ్యూచర్ ప్లాన్స్‌ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే?

"కచ్చితంగా రానున్న రోజుల్లో ఒక విప్లవమే సృష్టిస్తాను. పెద్ద యుద్ధమే ప్రారంభం అవుతుంది. అందులో కచ్చితంగా నేను గెలిచి వస్తాను. టెక్కలి నుంచి గెలిచి వస్తాను" అని అన్నారు.

బీసీ సామాజిక నినాదంతో దువ్వాడ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఫ్యూచర్ ప్లాన్స్‌ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే?

MLC Duvvada Srinivas

Updated On : September 13, 2025 / 9:08 PM IST

MLC Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ తలుపులు మూసుకుపోయినట్టేనా? టీడీపీలో చేరికకు అచ్చెన్నాయుడు బ్రేక్‌ వేశారా? స్వతంత్రంగా పోటీ చేస్తారా? కొత్త పార్టీ పెడతారా? జనసేనలోకి వెళ్తారా? వంటి ప్రశ్నలు వస్తున్నాయి.

దీనిపై దీనిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. “ఒకప్పుడు నా శక్తి ఏంటో శ్రీకాకుళంలో చూపించాను. కులానికి పట్ల అక్రమాలు కులానికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాను. నేను మాట్లాడుతుంది కులం కోసమే కాదు.. కులాల కోసం..

కళింగ కులం మాది.. జిల్లాలో మేము రూల్ చేయాలి.. మేము రూల్ చేయాల్సిన జిల్లాలో మమ్మల్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అసలు ఎవరు అచ్చన్నాయుడు? అసలు మా నియోజక వర్గంలో అచ్చెన్నాయుడి పోటీ ఏంటి? చంద్రబాబు నాయుడికి తెలియజేయాలని అనుకుంటున్నాను.

Also Read: అందుకే ఆమెను నేను దగ్గరకు తీసుకున్నాను.. ఈ ప్రేమ వ్యవహారాలేంటని కొందరిలో ఈ ప్రశ్నలు తలెత్తాయి..: దువ్వాడ శ్రీనివాస్‌

మీరు ఇంకో కళంగ కమ్యూనిటీకి ఇవ్వండి. ఆయనకి ఎలా ఇస్తారు? ఎంపీగా రామ్మోహన్ నాయుడుకి ఎలా ఇస్తారు అది కళింగ సీట్ కదా? మాకు మీరు ఇచ్చే సీట్లు ఏమైనా ఇస్తే ఓన్లీ శ్రీకాకుళంలోనే ఇస్తారు. మూడు ఎమ్మెల్యేలు ఇస్తారు. (MLC Duvvada Srinivas)

ఒక ఎంపీ ఇస్తారు, దట్స్ అల్ దేర్ ఎండ్స్ ది మేటర్. బీసీలకి మరి అవకాశం ఇవ్వరా? బీసీలకు అవకాశం రావాలి. మా జిల్లా వరకు వస్తే అన్ని కులాలు కులాల పునాదుల మీద అవుతున్నాయి కదా..

“కచ్చితంగా రానున్న రోజుల్లో ఒక విప్లవమే సృష్టిస్తాను. పెద్ద యుద్ధమే ప్రారంభం అవుతుంది. అందులో కచ్చితంగా నేను గెలిచి వస్తాను. టెక్కలి నుంచి గెలిచి వస్తాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మనసు మారి నన్ను మళ్లీ పిలిస్తే వెళ్తాను.

ఒకవేళ అనుకోకపోతే ఇండిపెండెంట్‌గానే ఉంటాను. గొడవ నాకు, ధర్మాన బ్రదర్స్ కి మధ్య. మా ఇద్దరికీ మధ్య జరగాల్సిన ఫైట్ ఇది. ఈ ఫైట్‌లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ కన్విన్స్ అవ్వడం అంత చిన్న విషయం కాదు.

యధార్థవాది లోక విరోధి అంటారు. ఇప్పుడు ఇన్ని మాటలు నేను ఆడాను. ధర్మాన ప్రసాద్, కృష్ణదాసుల దొంగతనాన్ని బయట పెట్టాను. ఎర్ర న్నాయుడు, అచ్చెన్నాయుడు జిల్లాకి చేసిన జిల్లాకి మోసం చేశారు. వాళ్ల గురించి మాట్లాడతాం. ఈ వాస్తవాలు మాట్లాడితే మనం శత్రువు కాక మిత్రుడై కూర్చుంటారా? ఇవి మాట్లాడటానికి చాలా ధైర్యం ఉండాలి.

ఖలేజా ఉండాలి.. మాట్లాడిన తర్వాత జరగబోయే పరిణామాలకు సిద్ధపడాలి. ఇన్ని తెలిసి కూడా నేను మాట్లాడుతున్నాను. అయినా అలాగే ఉంటాను. అలాగే మాట్లాడుతాను. ఇదే నా స్వరం.. ఈ స్వరమే కొనసాగుతుంది నేను ఉన్నంతవరకు” అని అన్నారు.