Best Family Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఎంచుకోవాలి? ఫ్యామిలీ ఫ్లోటర్, పర్సనల్ పాలసీ.. మీ ఫ్యామిలీకి ఏది బెటర్?
Best Family Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలా? పర్సనల్ పాలసీ తీసుకోవాలా? రెండింటిలో ఏది బెటర్ అంటే?
Best Family Health Insurance
Best Family Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికి ప్రతి ఫ్యామిలీకి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే.. అత్యవసర పరిస్థితుల్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇకపై కేవలం ఆర్థిక భద్రత గురించి మాత్రమే కాదు..
కుటుంబ రక్షణ వలయం కూడా. ప్రస్తుతం హెల్త్ (Best Family Health Insurance) ఇన్సూరెన్స్ ఏది తీసుకున్నా దానికి ఉండే బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. మీరు ఒకరైతే పర్సనల్ హెల్త్ పాలసీలు తీసుకోవచ్చు.. అది మీ పెద్ద ఫ్యామిలీ అయితే అందరికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కూడా తీసుకోవచ్చు.
మీ వయస్సు, మెడికల్ హిస్టరీ, బడ్జెట్ ఆధారంగా సరైన హెల్త్ పాలసీని ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే వైద్య అత్యవసర పరిస్థితుల నుంచి ఈ హెల్త్ పాలసీలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంతేకాదు.. ఆర్థికపరంగా ఆదుకుంటాయి. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక సాధారణ శస్త్రచికిత్సకు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య బీమా పాలసీ రక్షణ కవచంలా కాపాడుతుంది.
కానీ, అసలు సమస్య ఏమిటంటే.. మార్కెట్లో చాలా హెల్త్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ హెల్త్ పాలసీ ఫ్యామిలీకి బెస్ట్ అనేది ఎంచుకోవడమే కష్టంగా మారింది. మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ మంచిదా? లేదా పర్సనల్ హెల్త్ పాలసీ మంచిందా? ఈ రెండింటిలో ఏది మీ ఫ్యామిలీకి సరైన ఆప్షన్ అనేది ఎంచుకునే ముందు ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా ఏంటి? :
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ మొత్తం కుటుంబానికి ఒకే బీమా మొత్తాన్ని కవర్ చేస్తుంది. అంటే.. పాలసీ మొత్తం (రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షలు) అందరు సభ్యులతో షేరింగ్ అవుతుంది. సాధారణంగా, ఈ పాలసీ ఒకే ప్రీమియంతో 4 సభ్యుల నుంచి 6 మంది సభ్యుల వరకు కవర్ చేయగలదు.
పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి? :
ఈ పాలసీలో ప్రతి వ్యక్తికి వేర్వేరు బీమా మొత్తం ఉంటుంది. ఉదాహరణకు.. ముగ్గురు వ్యక్తులు కవరేజీ కిందికి వస్తే.. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల కవర్ ఉంటే మొత్తం కవరేజీ రూ.15 లక్షలు ఉంటుంది.
ఫ్యామిలీ ఫ్లోటర్ vs వ్యక్తిగత పాలసీ : ఏది బెటర్? :
ఫ్యామిలీ ఫ్లోటర్
ప్రీమియం : తక్కువ (కవర్ షేరింగ్)
కవరేజీ : అందరికీ ఒక సాధారణ కవర్
వర్తింపు : యువ కుటుంబాలకు సరైనది,
క్లెయిమ్ స్టేటస్ : ఒక వ్యక్తి ఎక్కువగా వాడితే.. మిగిలిన వారికి తక్కువ డబ్బు..
వ్యక్తిగత పాలసీ :
ప్రీమియం : ఎక్కువ (ప్రతి వ్యక్తికి స్పెషల్ ప్రీమియం)
కవరేజీ : ప్రతి వ్యక్తికి ప్రత్యేక కవర్
వర్తింపు : వృద్ధులు, హై రిస్క్ ఉన్న వ్యక్తుల కోసం
క్లెయిమ్ స్టేటస్ : ప్రతి ఒక్కరికీ వారి సొంత కవరేజీ ఉంటుంది.
మీకు ఏ పాలసీ మంచిది? :
చిన్న కుటుంబం లేదా యువత : ఫ్యామిలీ ఫ్లోటర్
సీనియర్ సిటిజన్లు లేదా హై హెల్త్ రిస్క్ : పర్సనల్ పాలసీ
పెద్ద కుటుంబంలో ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యామిలీ ఫ్లోటర్‌ను ఇష్టపడతారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలివే :
హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు AMC రేషియో, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్‌వర్క్ ఆస్పత్రులు, వెయింటి పీరియడ్ వంటి అంశాలను పరిశీలించండి. మీకు ప్రీ డీసిజెస్ ఉంటే పాలసీని ఎంచుకునే ముందు డిస్క్లైమర్‌ను తప్పకుండా చదవండి.
FAQs : ఫ్యామిలీ ఫ్లోటర్ vs వ్యక్తిగత పాలసీ.. ఏది బెటర్? :
1. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తల్లిదండ్రులను యాడ్ చేయొచ్చా?
అవును. కానీ, చాలా బీమా కంపెనీల్లో సీనియర్ సిటిజన్లను కవర్ చేస్తే ప్రీమియం పెరుగుతుంది.
2. ఫ్యామిలీ ఫ్లోటర్‌లోని ఒక సభ్యుడు ఎక్కువ క్లెయిమ్ చేస్తే.. ఇతరుల పరిస్థితి ఏంటి?
కవర్ మొత్తం షేర్ అవుతుంది. అందుకే రెండో సభ్యునికి క్లెయిమ్ తక్కువగా ఉంటుంది.
3. వ్యక్తిగత పాలసీలపై ఫ్యామిలీ డిస్కౌంట్ అందుబాటులో ఉందా?
అవును.. చాలా బీమా కంపెనీలు ఒకటి కన్నా ఎక్కువ వ్యక్తిగత పాలసీలను కొనుగోలు చేస్తే 5శాతం నుంచి 10శాతం ఫ్యామిలీ డిస్కౌంట్ అందిస్తాయి.
4. ఫ్యామిలీ ఫ్లోటర్‌ను పర్సనల్ ఫ్లోటర్‌గా మార్చవచ్చా?
కొన్ని పాలసీలు ఈ ఆప్షన్ అందిస్తాయి. మీ బీమా కంపెనీని సంప్రదించండి
5. ఏ పాలసీ చౌకగా ఉంటుంది?
సాధారణంగా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు కవర్‌ను షేర్ చేస్తాయి అందుకే చాలా చౌకగా లభిస్తాయి.
