Bjp
Badwel by-election : కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థి పుంతల సురేష్ పేరును ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం పుంతల సురేష్ ను అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్న పుంతల సురేష్.. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. వైసీపీ నుంచి డాక్టర్ సుధ పోటీ చేస్తున్నారు. ఇక జనసేన, టీడీపీ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను ఇప్పటికే ప్రకటించారు.
ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల దాఖలుకు కొవిడ్-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే ప్రజలు, నాయకులు హాజరు కావాల్సి ఉంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబర్ 8వ తేది వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.